Share News

దివ్యాంగుడి ఆనందం..

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:09 AM

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ లోని రాజమ్మ కాలనీలో దివ్యాంగ పింఛన్‌ అందుకున్న ఓ వ్యక్తి ఉబ్బితబ్బిబయ్యా డు.

దివ్యాంగుడి ఆనందం..
దివ్యాంగుడికి పింఛన్‌ అందజేస్తున్న ఎమ్మెల్యే శిరీష

పలాస, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ లోని రాజమ్మ కాలనీలో దివ్యాంగ పింఛన్‌ అందుకున్న ఓ వ్యక్తి ఉబ్బితబ్బిబయ్యా డు. ఆ కాలనీలో ఎన్టీయార్‌ భరోసా పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా దివ్యాంగుడు కోట రాముకి రూ.10వేల పింఛన్‌ అందించడంతో ఆనందం పట్టలేకపోయాడు. తమ ప్రభుత్వం పూర్తిస్థాయి భరోసాగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేయే తన ఇంటికి వచ్చి పింఛన్‌ ఇవ్వడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - Sep 02 , 2025 | 12:10 AM