Share News

ధాన్యం తడిచి.. పొలాల్లో నీరు చేరి

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:57 PM

జిల్లాలో దిత్వా తుఫాన్‌ ప్రభావంతో అక్కడక్కడ అడపాదడపా కురిసిన జల్లుల కు విక్రయానికి సిద్ధంచేసిన ధాన్యం తడిసిపోయాయి. పలు చోట్ల పంటపొలాల్లో నీరుచేరడంతో కోసిన వరి పనులు ఆరకపోవడంతో కుప్పులుగా పెట్టేందుకు రైతులు ఇబ్బందిపడుతున్నారు. పంటలు దెబ్బతిని నష్టపోతామేమోనని రైతులు భయాందో ళన చెందుతున్నారు.

 ధాన్యం తడిచి.. పొలాల్లో నీరు చేరి
నందిగాం: సర్వీసు రహదారిలో ధాన్యాన్ని ఆరబెట్టిన దృశ్యం

జిల్లాలో దిత్వా తుఫాన్‌ ప్రభావంతో అక్కడక్కడ అడపాదడపా కురిసిన జల్లుల కు విక్రయానికి సిద్ధంచేసిన ధాన్యం తడిసిపోయాయి. పలు చోట్ల పంటపొలాల్లో నీరుచేరడంతో కోసిన వరి పనులు ఆరకపోవడంతో కుప్పులుగా పెట్టేందుకు రైతులు ఇబ్బందిపడుతున్నారు. పంటలు దెబ్బతిని నష్టపోతామేమోనని రైతులు భయాందో ళన చెందుతున్నారు.

ఫపాతపట్నం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి):పాతపట్నం పంచాయతీ కె.గోపాల పురం, ఏఎస్‌కవిటి పంచాయతీ పరిధితోపాటు పలుగ్రామాల్లో కళ్లాల్లో నూర్చేసి సిద్ధంగాఉంచిన ధాన్యం వర్షాలవల్ల తడిసిపోవడంతో రంగుమారిపోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల పంటకొచ్చిన వరిచేను తుఫాన్‌ వల్ల కోతలు నిలిపివేశారు. దీంతో కంకులురాలిపోవడంతోపాటు నాణ్యత దెబ్బతినే అవ కాశముందని రైతులు వాపోతున్నారు. పలుచోట్ల నూర్చేసిన ధాన్యం తడిచిపోయా యని రైతులు చెబుతున్నారు.

ఫవజ్రపుకొత్తూరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి):మండలంలోని పలుచోట్ల తుఫాన్‌ ప్రభావంతో ఆదివారం రాత్రి కురిసిన చిరుజల్లులకు పొలాల్లో నీరుచేరింది. దీంతో రైతులు కోతకోసి వరిపనలు తడుస్తుండడంతో బేజారవుతున్నారు. దీనికితోడు తుఫాన్‌ హెచ్చరికలనేపథ్యంలో వరికోతలు నిలిపివేశారు. అయితే అపరాలు విత్తనా లు చల్లి ఎక్కువ రోజులు అవుతుండడంతో కోత సమయంలో మొక్కలు తెగిపోయే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. అలాగే పంట బాగా పండడంతో వెన్ను విరిగిపోయే అవకాశముందని రైతులు చెబుతున్నారు.రిట్టపాడు,సీతాపురం, నగరపంల్లి, బెండి, గుల్లలపాడు రైతులు వరి కోతలు నిలిపివేశారు. తుఫాన్‌ తగ్గిన తర్వాత కోతలు ప్రారంభిస్తామని వారంతా చెబుతున్నారు.

ఫనందిగాం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): కోమటూరు, నందిగాం తదితర గ్రామాల్లో సోమవారం పడిన చిరుజల్లులకు ధాన్యం, వరి పనలు తడిసిపోవడంతో మంగళవారం ఆరబెట్టే పనుల్లో నిమగ్నమయ్యారు. రహదారులు, కల్లాల్లో ధాన్యాన్ని ఆరబెట్టి బస్తాల్లోకి ఎత్తి టార్పాలిన్లు కప్పారు.మంగళవారం కూడా ఆకాశం మేఘా వృతం కావడంతో వర్షం కురుస్తుందని ఆందోళన చెందారు.

Updated Date - Dec 02 , 2025 | 11:57 PM