Share News

మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:01 AM

ఏజెన్సీ ప్రాంతంలోని మా రు మూల గ్రామా ల్లో మౌలిక సదు పాయాల కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయం
శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

హరిపురం, సె ప్టెంబరు 12(ఆం ధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతంలోని మా రు మూల గ్రామా ల్లో మౌలిక సదు పాయాల కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మందస మండలం హంసరాలి వద్ద జల్‌జీవన్‌ పథకంలో భాగంగా రూ.58.30లక్షలతో, శాసనం గ్రామంలో రూ.92.40 లక్షల నిర్మించనున్న తాగునీటి ప్రాజెక్టు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశా రు. దీంతోపాటు మందూరు గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ను ప్రారంఽబించారు. అనంతరం సిరిపురం గ్రామంలో దేవదాయశాఖ ఆలయ పరిధిలోని కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడారు. దసరా ఉత్స వాలకు ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్యక్రమం లో టీడీపీ మండల అధ్యక్షులడు, కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బావన దుర్యోధన, నాయకులు పీరుకట్ల విఠల్‌, దాసరి తాతారావు, రట్టి లింగరాజు, తమిరి భాస్క రరావు, లబ్బ రుద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

పలాస రూరల్‌, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): తర్లాకోట గ్రామంలో జల్‌జీవన్‌ మిషన్‌ పథకం ద్వారా రూ.58.40 లక్షలతో తాగునీటి ప్రాజెక్టు పనులకు శుక్రవారం ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు పీరికట్ల విఠల్‌, పార్టీ మండల అధ్యక్షుడు కుత్తుమ లక్ష్మణకుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ వంకల కూర్మారావు, ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాసరావు, దువ్వాడ సంతోష్‌, కుమారరాజా పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 12:01 AM