Share News

నిరుద్యోగ సమస్య నివారించడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jun 24 , 2025 | 12:01 AM

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నివారించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు.

నిరుద్యోగ సమస్య నివారించడమే ప్రభుత్వ లక్ష్యం
మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌

  • ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌

  • జాబ్‌మేళాలో 281మంది ఎంపిక

ఇచ్ఛాపురం, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నివారించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. సోమవారం ఎంతోటూరు గ్రామంలో గల ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఏపీ స్కిల్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత వైసీపీ పాలనలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్‌మేళాల ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తుందని అన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి జాబ్‌మేళా నిర్వహించడం ద్వారా నిరుద్యోగ సమస్యను నవారిస్తామని స్పష్టం చేశారు. 900 ఉద్యోగాల భార్తీలో భాగంగా 17 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించగా.. 832 మంది నిరుద్యోగ యువత హాజరుకాగా.. 281 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని అన్నారు. కార్యక్రమంలో స్కిల్‌ డవలప్‌మెంట్‌ చైర్మన్‌ సాయికుమార్‌, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజుతోపాటు ఎస్‌వీ రమణ, రాజేంద్రప్రసాద్‌, శేఖర్‌, కామేష్‌, టీడీపీ నాయకులు పి.తవిటయ్య, ఎన్‌.కోటి, నందికి జాని, కొండా శంకర్‌, లీలారాణి, కొరాయి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 12:01 AM