గ్రామీణ రోడ్ల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:17 AM
గ్రామీణ రోడ్ల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
జలుమూరు, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ రోడ్ల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లింగాలవలస నుంచి ఉసిరికిజోల వరకు నిర్మించిన బీటీ రోడ్డు, శ్రీముఖలింగం రోడ్డు నుంచి పంగవానిపేటకు నిర్మించిన సీసీ రోడ్డు, యలమంచిలి, అక్కురాడ వద్ద నిర్మించిన సీసీ రోడ్లను శుక్రవారం ప్రారంభించారు. స్థానికంగా ఓ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణ రోడ్లకు కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్రం సహకారంతో కోట్లాది రూపాయల ఉపాధి హామీ నిధులతో రోడ్ల పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయి ప్రత్యూష, ఎంపీపీ వాన గోపి, టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, ఎంపీడీవో కె.అప్పలనాయుడు, తహసీల్దార్ జె.రామారావు, పలు వురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.