రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:53 PM
రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధే కూట మి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, పార్టీ కళింగ వైశ్య సాధికారక సమితి కన్వీనర్ బోయిన గోవిందరాజులు అన్నా రు.
కోటబొమ్మాళి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధే కూట మి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, పార్టీ కళింగ వైశ్య సాధికారక సమితి కన్వీనర్ బోయిన గోవిందరాజులు అన్నా రు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి వర్గ సభ్యు లు నిరంతరం ప్రజలతో మమేకమై అభివృద్ధి, సంక్షేమాలు అందిస్తున్నారన్నారు. ఇది చూసి ఓర్వలేకనే ప్రతి పక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని అన్నా రు. కేంద్రం సాయంతో రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యత లేక అభివృద్ధి కుంటుపడిందని ఈ విష యం ప్రజలు తెలుసుకున్నారన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు రైతాంగం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్రి అప్పారావు, సాసుమహంతి ఆనందరావు, కోరాడ పెద్ద గోవింద, చిన్న గోవింద తదితరులు పాల్గొన్నారు.