ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:31 PM
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.
- ఎమ్మెల్యే గౌతు శిరీష
-ఆర్‌వోబీ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ
పలాసరూరల్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం కాశీబుగ్గ రైల్వేఫ్లైఓవర్ నిర్వాసితులకు(ఆర్‌వోబీ) ఇంటి స్థలాల పట్టాలను ఆమె పంపిణీ చేసి మాట్లాడారు. గతంలో టీడీపీ హయాంలో రైల్వే ఫ్లైఓవర్ కోసం ఇళ్లను తొలగించినప్పుడు నాటి ఎమ్మెల్యే గౌతు శివాజీ నగదుతో పాటు ఇళ్ల స్థలాలను అందిస్తానని మాటిచ్చారని, దాని ప్రకారమే రాజకీయాలకతీతంగా ప్రతీ నిర్వాసితుడికి ఇంటి స్థలాలను అందజేశామని అన్నారు. గత ప్రభుత్వం కేవలం మాటలు మాత్రమే చెప్పిందని అన్నారు. ప్రజలందరి సహకారంతో పలాస-కాశీబుగ్గ పట్టణ అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఆర్‌వోబీకి సంబంధించి 90మంది నిర్వాసితులకు లాటరీ పద్ధతిలో ఇళ్ల నెంబర్లను కేటాయించి పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో గ్రంథి వెంకటేష్, తహసీల్దార్ ఎన్.కళ్యాణచక్రవర్తి, ఏపీటీడీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, టీడీపీ నాయకులు లొడగల కామేశ్వరరావు, పీరుకట్ల విఠల్, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, దువ్వాడ శ్రీకాంత్, రవిశంకరగుప్తా తదితరులు పాల్గొన్నారు.
రైతాంగాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటాం
వజ్రపుకొత్తూరు, ఆగసు 20 (ఆంధ్రజ్యోతి): రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే శిరీష అన్నారు. బుధవారం పెద్దబొడ్డపాడు వద్ద వంశధార నీటికి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు రైతులకు వంశధార నీరు అందించలేకపోయింద న్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వంశధార నీరు శివారు భూములకు అందిస్తున్నట్లు చెప్పారు. కార్య క్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సూరాడ మోహన రావు, ఉపాధ్యక్షుడు ఎ.ఉమామహేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ కణితి సురేష్‌చౌదరి, స్థానిక నాయకుడు వల్లభ కృష్ణారావు పాల్గొన్నారు. వంశధార నీరు అందించ డంతో పలాస, వజ్రపుకొత్తూరు మండలాల రైతులు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా శివారు భూములకు నీరు విడుదల కావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.