ప్రజా సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:20 AM
ప్రజా సంక్షేమమే ధ్యేయమని టీడీపీ నాయకులు తెలిపారు. గురువారం జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగుకార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల కరపత్రాలను పంపి ణీచేసి పఽథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదోనని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలకు సంబంధించిన వినతులను ప్రజల నుంచి తీసుకున్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయమని టీడీపీ నాయకులు తెలిపారు. గురువారం జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగుకార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల కరపత్రాలను పంపి ణీచేసి పఽథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదోనని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలకు సంబంధించిన వినతులను ప్రజల నుంచి తీసుకున్నారు.
ఫపొందూరు, జూలై 10 (ఆంధ్రజ్యోతి): సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న అపూర్వస్పందన కూటమి ప్రభుత్వం తొలిఏడాది అందించిన పాలనకు నిదర్శనమని పీయూసీ చైర్మన్,ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలి పారు.మండలంలోని లోలుగులో నిర్వహించిన తొలిఅడుగు కార్యక్ర మంలో మాట్లాడుతూ సంక్షేమమే కాకుండా రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. పార్టీ జెండా చూడకుండా అర్హులందరికీ సంక్షేమం అందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయమన్నారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పఽథకాలు అందుతున్నవీ లేనివి అడిగితెలుసుకున్నారు. తక్షణమే సాంకేతిక సమస్యలు పరిష్కరించి అర్హులైనవారందరికీ పఽథకాలు వర్తింపజేసేలా చూడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులమీద ఉందని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, నాయకులు తాడిబోయిన చంద్రశేఖరరావు, టీడీపీ మండలాధ్య క్షులు సీహెచ్ రామ్మోహన్, ఏఎంసీ మాజీ చైర్మన్ అన్నెపు రాము, తెలుగు యువత జిల్లా ప్రధానకార్య దర్శి బలగ శంకరభాస్కర్, బాడాన గిరి, పిఎసిఎస్ అధ్యక్షుడు వండాన మురళి పాల్గొన్నారు.
ఫజి.సిగడాం, జూలై 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని నాగుల వలస, పెంట, జి.సిగడాం, గేదెలపేట తదితర గ్రామాల్లో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమం లో టీడీపీ మండలాధ్యక్షుడు కుమరాపు రవికుమార్, నాయ కులు పడాల అప్పన్న, మజ్జి కన్నంనాయుడు, బాలబొమ్మ వెంక టేశ్వరరా వు, అంపోలు ఈశ్వరరావు, పలిశెట్టి సూర్యనారాయణ, డబ్బాడ ఆదినారాయణ పాల్గొన్నారు.
ఫనందిగాం, జూలై 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని బోరుభద్ర పంచాయతీ కంచివూరు, కామదేనువుల్లో రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి మెట్ట పద్మావతి ఆధ్వర్యంలో సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు.
ఫకొత్తూరు, జూలై 10(ఆంధ్రజ్యోతి):ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను ఇంటింటికి వెళ్లి వివరించడమే సుప రిపాలనలో తొలి అడుగు ముఖ్య ఉద్దేశమని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. కొత్తూరు మండలంలోని బలద లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వాహించారు. ఇంటిం టికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అందుతున్నది లేనిది ప్రజలకు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జడ్పీ పాఠశాల భవ నాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో మెరుగైన విద్యనందించా లన్న లక్ష్యంతో యూపీపాఠశాలను అప్‌గ్రేడ్ చేయించేందుకు కృషి చేశానని తెలిపారు.గ్రామంలో రేషన్‌షాపు దూరంగా ఉండడం వల్ల రేషన్ తీసుకునేందుకు, పద్మనాభసాగరం ఆక్రమణకు గురవడంతో సాగునీటికి, ఆంరఽధా-ఒడిశా సరిహద్దులను కలిపే సీతాపురం నుం చి కిడిగాం వరకు రహదారి సక్రమం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడవల్సి వస్తోంది గ్రామస్థులు ఎమ్మెల్యేకు వివరిం చారు.దీంతో స్పందించిన ఆయన ప్రఽధానరహదారికి రూ.20 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, అన్నిసమస్యల పరిష్కారంకృషి చేస్తాన ని హామీఇచ్చారు.సాగునీరందించాలన్న లక్ష్యంతో మాతల, కడుము ఎత్తిపోతల పథకాలు నిర్వహణకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు.కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు అగతముడి మా ధవరావు, కార్యదర్శి అరుబోలు దశరధరావు,మండల పరిషత్ ఉపా ధ్యక్షులు లోతుగెడ్డ తులసీవరప్రసాదరావు, మాతలగాంఽధీ, అగత ముడి అరుణకుమార్, పడాల లక్ష్మణరావు, వలురౌతు సుధాకరావు, కుంచాల నూకరాజు పాల్గొన్నారు.
: