Share News

‘స్వచ్ఛాంధ్ర’ లక్ష్యాలను సాధించాలి

ABN , Publish Date - Sep 21 , 2025 | 12:01 AM

‘స్వ చ్ఛాంధ్ర-స్వ ర్ణాంధ్ర’ లక్ష్యాలను సాధించాలని విజ యనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మె ల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.

‘స్వచ్ఛాంధ్ర’ లక్ష్యాలను సాధించాలి
రణస్థలం: హైస్కూల్‌ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

రణస్థలం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘స్వ చ్ఛాంధ్ర-స్వ ర్ణాంధ్ర’ లక్ష్యాలను సాధించాలని విజ యనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మె ల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. బంటు పల్లి పంచాయ తీ జడ్పీ హైస్కూల్‌ ఆవరణలో సర్పంచ్‌ నడుకుదిటి రజిని ఆధ్వ ర్యంలో శనివారం స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛదివస్‌’ను న్విహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవర ణను పరిశుభ్రం చేసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీసీఎం ఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌, కూటమి నాయకులు లంక శ్యా మలరావు, పిసిని జగన్నాఽథంనాయుడు, పిన్నింటి భానోజీనాయుడు, రౌతు శ్రీనివాస్‌, గొర్లె సాయిదీప్‌, దన్నాన మహేష్‌, మెన్నె కృష్ణానందం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌ స్వస్త్‌ నారీ.. సశక్త్‌ పరి వార్‌ అభియాన్‌లో పాల్గొన్నారు.

పరిశుభ్రతతో ఆరోగ్యం: ఎమ్మెల్యే బగ్గు

పోలాకి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉండవచ్చని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి, ప్రతిజ్ఞ చే యించారు. వెలుగు, ఉపాధి, అంగన్‌వాడీ, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో గరిమెళ్ల రవికుమార్‌, మండల ప్రత్యేకాధికారి మధు, తహసీల్దార్‌ పి.శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ పద్మావతి, సర్పంచ్‌ మజ్జి రమణమ్మ, ఏవో చిరంజీవి, నాయకులు రోణంకి కృష్ణంనాయుడు, ఎంవీ నాయుడు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆచరణలో చూపాలి: ఎమ్మెల్యే మామిడి

పాతపట్నం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ప్లా స్టిక్‌ నిషేధాన్ని ఆచరణలో చూపాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. కాగువాడ పంచా యతీలో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో ఆయ న పాల్గొని మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత, బావుల్లో క్లోరినేషన్‌ ఎప్పటికప్పుడు నిర్వహించుకో వాల న్నారు. మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నల్లి జగదీశ్వరరావు, ప్రత్యే కాధికారి డాక్టర్‌ ఎం.కిరణ్‌కుమార్‌, తహసీల్దార్‌ నందిగాం ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు పెంచాలి: జడ్పీ సీఈవో

ఎల్‌ఎన్‌ పేట, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): మొక్కల పెంపకంపై ప్రతీఒక్కరూ ప్రత్యేకశ్రద్ధ చూపాలని జడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజా అన్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రావిచెంద్రి జడ్పీ ఉన్నత పాఠశాల ఆవ రణలో మొక్కలు నాటారు. ఎంపీడీవో పి..శ్రీనివాస రావు, ఏపీవో శ్రీదేవి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

జలుమూరు, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): పరిసరాలు పరిశుభ్రత పచ్చదనంతోనే ఆరోగ్యం వస్తుందని ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయిప్రత్యూష అన్నారు. స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్రలో భాగంగా స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలోను, కొండపోలవవలస ప్రాథమిక పాఠశాల ఆవరణలోను శనివారం ఆమె మొక్కలు నాటి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో బి.చిన్నమ్మడు, తహసీల్దార్‌ జె.రామారావు, ఈవోిపీఆర్డీ ఉమామహేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే శ్రీముఖలింగేశ్వరాలయంలో శనివారం స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవదాయ సిబ్బంది, అర్చకులు, సర్పంచ్‌ టి.సతీష్‌ ఆధ్వర్యంలో ఆలయాన్ని శుభ్రపరిచారు. అర్చకులు వెంకటాచలం, నారాయణమూర్తి, శ్రీకృష్ణ, శివ, అచ్యుత, దేవాదాయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2025 | 12:01 AM