రాష్ట్రంలో పేదల అభివృద్ధే పీ-4 లక్ష్యం
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:24 AM
రాష్ట్రంలోని పేదలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా చేపట్టిన పీ-4 కార్యక్రమాన్ని ఈనెల 19 ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు సూచించారు.
19న ప్రారంభానికి సిద్ధంకండి
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబునాయుడు
శ్రీకాకుళం కలెక్టరేట్, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేదలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా చేపట్టిన పీ-4 కార్యక్రమాన్ని ఈనెల 19 ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు సూచించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో అమరావతిలోని సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్న 10శాతం మంది అట్టడుగు స్థానంలో ఉన్న 20శాతం మంది పేదలను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధి చేయాలని సూచించారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఈనెల 15లోగా ఎంపికలను పూర్తి చేసి, 19న ప్రారంభానికి సిద్ధంగా ఉండాలన్నారు. బంగారు కుటుంబాలను ఇప్పటికే దత్తత తీసుకున్న వారిని అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, సీపీవో ప్రసన్నలక్ష్మి, డ్వామా పీడీ సుఽధాకర్, ఉద్యానశాఖ అధికారి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.