Share News

మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం: ఎంజీఆర్‌

ABN , Publish Date - May 06 , 2025 | 11:38 PM

మహిళలు ఆర్థిక స్వావలంబనే లక్ష్యమని, దీని కోసం ప్రభుత్వం అనేక స్వయం ఉపాధి పథకా లను అమలు చేస్తోందని, వీటిని సద్విని యోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం: ఎంజీఆర్‌
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

కొత్తూరు, మే 6(ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థిక స్వావలంబనే లక్ష్యమని, దీని కోసం ప్రభుత్వం అనేక స్వయం ఉపాధి పథకా లను అమలు చేస్తోందని, వీటిని సద్విని యోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. మంగళవారం స్థానిక కేజీబీవీ ఆవరణలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ కార్పొ రేషన్‌, ఈడబ్ల్యూఎస్‌ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు మూడునెలల పాటు కుట్టు శిక్షణ ఇస్తున్నామని, తదుపరి రూ.24 వేల విలువ చేసే కుట్టు మిషన్‌ అందించ నున్నా మన్నారు. కుట్టు శిక్షణ పొందిన మహిళలు బృందంగా ఏర్పడి ఉపాధి అవకాశాలు పెం పొందించుకుని ఆర్థికంగా స్థిరపడాలన్నారు. కార్యక్ర మంలో ఎంపీడీవో నీరజ, టీడీపీ నాయకులు అగతముడి అరుణకుమార్‌, పడా ల లక్ష్మణరావు, టొంపల తిరుపతిరావు, ఎ. మాధవ రావు, కుంచాల నూకరాజు, మాతల గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:38 PM