సహకార రంగం బలోపేతం చేయడమే లక్ష్యం
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:36 PM
సహకార రంగాన్ని బలోపేతం చేసి, ప్రజలకు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
అరసవల్లి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): సహకార రంగాన్ని బలోపేతం చేసి, ప్రజలకు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొ న్నా రు. బుధవారం నగరంలోని స్థానిక అంబేద్క ర్ ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి సదస్సు- 2025 ముగింపు వేడుకలు నిర్వహిం చారు. కేంద్రప్ర భుత్వం 2025ను సహకార సంవత్సరంగా ప్రక టించిందని, దేశ వ్యాప్తంగా 29 కోట్ల మంది సభ్యులు గల ఈ వ్యవస్థ ప్రాముఖ్య తను గుర్తించి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందన్నారు. డ్వాక్రా బజార్ నిర్వహణకు డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌కు చెక్కును అంద జేశారు. నాబార్డు సీజీఎం గోపాల్, జీఎం కేవీఎస్ ప్రసాద్, మూడు జిల్లాల డీసీసీబీ అధ్యక్షులు శివ్వాల సూర్యనారాయణ, కిమిడి నాగార్జున, తాతారావు, డీసీఎంఎస్ చైౖర్మన్ చౌదరి అవినాష్, సీఈఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కాలనీ పేరు మార్పునకు ఆదేశం
అరసవల్లి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): నగరంలోని కంపోస్టు కాలనీకి చంద్రన్న కాల నీగా మార్చాలని స్థానికుల విజ్ఞప్తి మేరకు తగు చర్యలు తీసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. బుధవారం కాలనీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి ఆవి ష్కరించారు. నగరంలో బలగ ప్రాంతంలో సీసీ రోడ్లను మంత్రి అచ్చెన్నా యుడు ప్రారంభించారు. కార్యక్రమంలో ముని సిపల్ కమిషనర్ ప్రసాదరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.