Share News

సహకార రంగం బలోపేతమే లక్ష్యం

ABN , Publish Date - Sep 09 , 2025 | 11:50 PM

సహకార సంస్థ లను బలోపేతం చేసి లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించ డమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవి కుమార్‌ అన్నారు.

సహకార రంగం బలోపేతమే లక్ష్యం
పొందూరు: పీఏసీఎస్‌ గోడౌన్‌ ప్రారంభోత్సవ శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

పొందూరు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సహకార సంస్థ లను బలోపేతం చేసి లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించ డమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవి కుమార్‌ అన్నారు. లోలుగు కాలనీ సమీపంలో రూ.40 లక్షల నాబార్డ్‌ నిధులతో నిర్మించిన పీఏసీఎస్‌ గోడౌన్‌ ను మంగళ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం సహకారరంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో కోల్డ్‌స్టోరేజీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పొందూరుతో పాటు ఇతర ప్రాంత రైతులకు సౌకర్యంగా ఉండేలా గోడౌన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేయాలని జి ల్లా సహకార ఆడిట్‌ అధికారి చంటిబాబు, డీసీసీబీ జీఎం ఎస్‌.జగదీష్‌, పొందూరు పీఏసీఎస్‌ చైర్మన్‌ వండాన మురళికి సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కూన సత్యనారాయణ, టీడీపీ మండల అధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ అన్నెపు రాము, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి శంకరభాస్కర్‌, తహసీల్దార్‌ వెంకటేష్‌, ఎంపీడీవో సింహాచలం, పీఏసీఎస్‌ సీఈవో వై.పాపినాయుడు, పొందూరు డీసీసీబీ మేనేజర్‌ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం మలకాం (జాడపేట) గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే రవికుమార్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పం చ్‌ జాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ప్రాణాల రక్షణలో 108 కీలకం: శంకర్‌

అరసవల్లి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రజల ప్రాణాల రక్షణలో 108 అంబులెన్స్‌ సేవలు కీలకమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ మునిసిపల్‌ మైదానంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 108 అంబులెన్స్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన, నాణ్యమైన సేవ లను ఈ అంబులెన్స్‌ ద్వారా అందు తాయన్నారు. కార్యక్రమంలో 108 జిల్లా సమన్వయకర్త డా.ప్రకాశరావు, ఆర్‌ఎం బాలరాజు, మేనేజర్‌ నవీన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు మేలు చేసేలా చర్యలు: అశోక్‌

కవిటి, సెప్టెం బరు 9 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో రైతుల కు అవస రమైన పనులు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవా లని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బి. అశోక్‌ అన్నారు. రామయ్యపుట్టుగలో మంగళవారం విద్యుత్‌, ఉపాధి హామీ, ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ కనెక్షన్లు ఇప్పిం చాలని రైతు లు కోరుతున్నారని, ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథ కం ద్వారా ఎంతమేర పనులు జరిగాయని పీఆర్‌ అధికారులను ప్రశ్నిం చారు. రోడ్లు, కాలువల నిర్మాణ దశలను అడిగి తెలుసుకున్నారు. నియో జకవర్గంలో అభివృద్ధి పనులు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో కవిటి, కంచిలి, ఇచ్చాపురం, సోంపేట మండలాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2025 | 11:50 PM