కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:23 PM
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఏఐసీసీ కార్యదర్శి పాలక్‌వర్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
- ఏఐసీసీ కార్యదర్శి పాలక్ వర్మ
అరసవల్లి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఏఐసీసీ కార్యదర్శి పాలక్‌వర్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లా నుంచి 23 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. పార్టీలో కష్టించి పనిచేసేవారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుం దని, సిఫారసులకు తావు లేదని స్పష్టం చేశారు. అందరూ పార్టీ ఆదేశాలు, నియమా లను అనుసరించి మాత్రమే పనిచేయాలని, వ్యక్తిగత అజెండాలకు తావు లేదని స్పష్టం చేసారు. కార్యక్రమంలో రాష్ట్ర ఇన్‌ఛార్జి సూరత్ సింగ్ ఠాకూర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.శాంతకుమారి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, రామ్మోహనరావు పాల్గొన్నారు.