ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:41 AM
ప్రజా సమస్యల పరిష్కా రమే లక్ష్యంగా ప్ర జాదర్బార్ నిర్వహి స్తున్నట్టు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
పాతపట్నం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కా రమే లక్ష్యంగా ప్ర జాదర్బార్ నిర్వహి స్తున్నట్టు ఎమ్మెల్యే మామిడి గోవింద రావు తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వ హించారు. నియోజకవర్గం పరిధిలోని అధిక సంఖ్యలోని ప్రజలు వచ్చి పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. వచ్చన అర్జీలను పరిశీలించి 15రోజుల్లో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకంటానని తెలిపారు. వివిధ సమస్యలు పరిష్కారం కోరుతూ మొత్తం 357 వినతులు అందాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, ఎంపీడీ వోలతోపాటు అన్నిశాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.