Share News

సమస్యలు పరిష్కారమే ధ్యేయం

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:39 PM

ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పని చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.సోమవారం కోటబొమ్మాళిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వినతులు అందజేశారు.

 సమస్యలు పరిష్కారమే ధ్యేయం
అర్జీని పరిశీలిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పని చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.సోమవారం కోటబొమ్మాళిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వినతులు అందజేశారు. అర్జీలను పరిశీలించి గ్రీవెన్స్‌కు హాజరైన రెవెన్యూ, ఇరిగేషన్‌ రహదారులు, పంచాయతీ, విద్యుత్‌ అధికారాలకు అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కోటబొమ్మాళి ప్రభుత్వాసుపత్రిలో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న డి.కోటి ఇటీవల మృతిచెందడంతో ఆయన భార్య రత్నంకు రూ.50వేలు అందజేశారు.కాగా కోటబొమ్మాళి ఏఎంసీ యార్డులో ఏఎంసీ పాలక మండలి ప్రమాణ స్వీకారం జరిగింది.చైర్మన్‌గా బగాది శేషగిరిరావు, ఉపాఽధ్యక్షులుగా బాడాన వెంకటరమణమ్మ, సభ్యులుగా కర్రి రామిరెడ్డి, కవిటి ధర్మారావు, తాడి సింహాద్రినాయుడు, జర్జాన రాంజీ సూరాడ ధనరాజు, నడిపించి నాగరాజు, లండ సుజాత, పల్లి సునీత, దేవాది పద్మావతి, గౌరీ, హేమసుందరరా వు, అప్పలస్వామి, భీమారావు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమాల్లో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, కొత్తమ్మతల్లి ఆలయ చైర్మన్‌ కోరాడ గోవిందరావు, ఏఎంసీ కార్యదర్శి కె.రామారావు, పర్యవేక్షకులు టి.హేమలత, కె. మురళీకృష్ణ, ఎం.నాగమణి, నాయకులు కల్లి నాగయ్యరెడ్డి, శివకుమార్‌, కర్రి అప్పారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ పొన్నాడ గణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 11:39 PM