ప్రతి సమస్యకు పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:02 AM
ప్రతీ సమస్యకు పరిష్కార మార్గం చూపిం చడమే లక్ష్యంగా ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్టు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ స్పష్టం చేశారు.
ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే గొండు శంకర్
అరసవల్లి, జూన్ 13(ఆంధ్రజ్యోతి): ప్రతీ సమస్యకు పరిష్కార మార్గం చూపిం చడమే లక్ష్యంగా ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్టు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ స్పష్టం చేశారు. నగరంలోని విశాఖ-ఎ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ సమస్యకు సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారం అందేలా చూస్తామన్నారు. కూటమి పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో ముఖ్యంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో యువత పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం దర ఖాస్తులు వస్తున్నాయన్నారు. అలాగే గ్రామాల్లో మౌలిక వసతులైన డ్రైనేజీ, విద్యుత్తు, తాగు, సాగునీరు సమస్యలు వస్తున్నాయని తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఏడాది పాలనలో ప్రజల నుంచి మన్ననలు అందుకున్నామని, మరింత మెరుగైన అభివృద్ధి, సంక్షేమం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.