న్యూమోనియా మరణాలను తగ్గించడమే లక్ష్యం
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:20 AM
న్యూమోనియా మరణాలను తగ్గించడమే లక్ష్యమని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డా.మేరీ క్యాథరీన్ అన్నారు.
అరసవల్లి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): న్యూమోనియా మరణాలను తగ్గించడమే లక్ష్యమని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డా.మేరీ క్యాథరీన్ అన్నారు. స్థానిక వైద్యారోగ్యశాఖ కార్యాల యంలో న్యూమోనియాపై అవగాహన పోస్టర్లను గురువారం డీఐవో ఆర్.రాందాసుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. 5 ఏళ్ల లోపు పిల్లల్లో వచ్చే న్యూ మోనియాపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించడం, లక్ష ణాలు గుర్తించి నివారణ చర్యలు చేపట్టేందుకు అవ గాహన కలిగించాలన్నారు. దీనిపై ఈనెల 28 వరకు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీ కేంద్రాల్లో ప్రచారం చేయనున్నామన్నారు. కార్య క్రమంలో డీపీఎంవో డా.బి.రవీంద్ర, డిప్యూటీ డెమో కె.ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు.