Share News

పేదలకు గూడు కల్పించడమే లక్ష్యం

ABN , Publish Date - Sep 07 , 2025 | 11:28 PM

పేదలకు తిండి, గూడు, గుడ్డ కల్పించడమే లక్ష్యంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని, ఇదే లక్ష్యంతో ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు.

పేదలకు గూడు కల్పించడమే లక్ష్యం
టిడ్కో గృహాలను పరిశీలించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పేదలకు తిండి, గూడు, గుడ్డ కల్పించడమే లక్ష్యంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని, ఇదే లక్ష్యంతో ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు. పట్టణంలోని ఒకటో వార్డు జగ్గు శాస్త్రులపేట వద్ద నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను ఆదివారం పరిశీలించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వ ర్యంలో 2016-17లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 528 మంది ఇళ్లు లేని వారికి పక్కా గృహాలు మంజూరు చేసిందన్నారు. 80 శాతం పనులు పూర్తి కాగా ఆ తరువాత వైసీపీ ప్రభుత్వంలో పేదలపై కక్ష కట్టి ఇళ్ల నిర్మాణాలను అడ్డుకుందని విమర్శించారు. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం పేదలకు పక్కా గృహాలు అందిస్తున్నట్లు నిర్మాణాలు పూర్తి చేయకుండా హడావుడిగా ప్రారంభించిందని ఎద్దేవా చేశారు. ఇళ్ల నిర్మా ణాలు పూర్తి చేసి అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ తమ్మినేని రవి, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీతా విద్యాసాగర్‌, నాయకులు ఎస్‌.మురళీధర్‌, మొదలవలస హర్ష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 11:28 PM