Share News

25 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:41 PM

ఈ ఏడాది జిల్లాలో వర్షాకాలంలో 25 లక్షల మొక్కలను నాటేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా అటవీశాఖ అధికారి బి.వెంకటేశ్వరరావు తెలిపారు.

 25 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం
అధికారులతో సమీక్షస్తున్న డీఎఫ్‌వో వెంకటేశ్వరరావు

డీఎఫ్‌వో వెంకటేశ్వరరావు

నరసన్నపేట, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జిల్లాలో వర్షాకాలంలో 25 లక్షల మొక్కలను నాటేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా అటవీశాఖ అధికారి బి.వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆ శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మొక్కల సంరక్షణ బాధ్యతను వివిధ పరిశ్రమలకు అప్పగిస్తున్నామన్నారు. సామాజిక అటవీ పెంపకంపై ప్రజల్లో చైతన్యం చేయాలని సూచించారు. 62 నర్సరీల ద్వారా వచ్చే ఏడాదికి 40 లక్షలు మొక్కలు ప్లాంటేషన్‌ చేపడతామన్నారు. నాటే మొక్కలకు జియో ట్యాగింగ్‌ చేసి మొక్క పెరుగుదలపై పర్యవేక్షణ చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సబ్‌డివిజన్‌ అటవీశాఖ అధికారి నాగేంద్ర, ఫారెస్ట్‌ రేంజర్లు జగదీష్‌, రాజశేఖర్‌, సిబ్బంది వెంకటేష్‌, శ్రీనివాసరావు, నాగేంద్ర, జనప్రియ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:41 PM