Share News

బంగారు కుటుంబాల తయారీ లక్ష్యం

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:30 PM

అట్టడుగున ఉన్న వారిని అన్ని విధాలా ఆదుకుని బంగారు కుటుంబాల తయారీ లక్ష్యంగా వైద్యులు ముందుకు రావడం అభినంద నీయమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

బంగారు కుటుంబాల తయారీ లక్ష్యం
ఎమ్మెల్యే గొండు శంకర్‌తో డీఎంహెచ్‌వో, ఐఎంఏ ప్రతినిధులు

అరసవల్లి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): అట్టడుగున ఉన్న వారిని అన్ని విధాలా ఆదుకుని బంగారు కుటుంబాల తయారీ లక్ష్యంగా వైద్యులు ముందుకు రావడం అభినంద నీయమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. ఈ మేరకు శనివారం ఐఎంఏ ప్రతినిధులు ఆయనను కలిసి అభినం దించారు. నగరంలోని కాకివీధి యూపీహెచ్‌సీలో ఉచిత వైద్యసేవలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీ-4లో భాగంగా 1200 మంది బంగా రు కుటుంబాలకు విద్య, వైద్యం, ఆర్థిక సహాయం అందిం చేందుకు ఏఐంఏ సంకల్పించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా.కె.అనిత, డీసీహెచ్‌ఎస్‌ డా. కల్యాణ్‌బాబు, ఐఎంఏ ప్రతినిధులు డా.గొండు గంగాధర్‌, డా.సనపల నర్సింహమూర్తి, డాక్టర్‌ గుప్త తదితరులు పాల్గొన్నారు.

పోషకాహారంతో ఆరోగ్యం

శ్రీకాకుళం రూరల్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యార్థులకు అక్షయపాత్ర ద్వారా పోషకాహారం అందిస్తు న్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. శనివారం శ్రీకాకుళం రూరల్‌ మండలం సింగుపురం హైస్కూల్‌లో ‘ఉదయం పోషకాహారం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంతో పాటు అదనంగా వారానికి మూడు రోజులు ఒక్కోరోజు ఒక్కక్కటి చొప్పున మిల్లెట్‌ బర్‌, పీనట్‌ మసాలా, చెన్న మసాలా పోషకాహారం అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. విద్యా ర్థులకు పోషకాహారం అందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మల్ల భారతి, సిబ్బంది, వైస్‌ సర్పంచ్‌ కుంచాల ఆదినారా యణ, ఎంపీటీసీ పంగ సత్యనారాయణ, గుండ అప్పల నాయుడు, పంగ రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 11:30 PM