క్రీడలపై ఆసక్తి పెంచడమే లక్ష్యం
ABN , Publish Date - Jul 31 , 2025 | 11:54 PM
క్రీడలపై విద్యార్థులకు ఆసక్తి పెంచడంతో పాటు వారికి చేయూత నిచ్చి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే క్రీడా భారతి లక్ష్యమని పూర్వపు ఇండియన్ వెయిట్ లిఫ్టర్, ఒలింపియన్ మాణిక్యాలు అన్నారు.
శ్రీకాకుళం స్పోర్ట్స్, జూలై 31(ఆంధ్రజ్యోతి): క్రీడలపై విద్యార్థులకు ఆసక్తి పెంచడంతో పాటు వారికి చేయూత నిచ్చి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే క్రీడా భారతి లక్ష్యమని పూర్వపు ఇండియన్ వెయిట్ లిఫ్టర్, ఒలింపియన్ మాణిక్యాలు అన్నారు. అరసవల్లిలోని ఓ ప్రైవేటు పాఠ శాలలో గురువారం క్రీడాభారతి కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాణి క్యాలు మాట్లాడుతూ.. సెల్ ఫోన్లు విడిచిపెట్టి క్రీడలపై దృష్టి సారించడం ద్వారా క్రమశిక్షణ, విజయాలు వరిస్తా యన్నారు. క్రీడాభారతి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సం ఘం అధ్యక్షుడిగా చెట్టికం రాజ్ కుమార్, ప్రధాన కార్య దర్శిగా బి.లక్ష్మణ్‌దేవ్, కోశాధికారిగా దండాసి జ్యోతిభాస్కర్, కార్యవర్గ సభ్యులుగా బి.ఖగేశ్వరరావు, మణికంఠ, కృష్ణారావు ప్రసాద్‌లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేశారు.