సొంతింటి కలను నెరవేర్చడమే ధ్యేయం
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:41 PM
అర్హులైన పేదలకు సొంతింటి క లను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని వ్యవసాయశాఖ మంత్రి కిం జరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.మంగళవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, 21మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.23లక్షల చెక్కులను మంత్రి పంపిణీచేశారు. అంగన్‌వాడీ సహాయ కులుగా ఎంపికైన ఆరుగురుకి నియామక పత్రాలను అందజేశారు.
కోటబొమ్మాళి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): అర్హులైన పేదలకు సొంతింటి క లను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని వ్యవసాయశాఖ మంత్రి కిం జరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.మంగళవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, 21మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.23లక్షల చెక్కులను మంత్రి పంపిణీచేశారు. అంగన్‌వాడీ సహాయ కులుగా ఎంపికైన ఆరుగురుకి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గతప్రభుత్వం ఇళ్లపట్టాల కోసం భూముల కొనుగోలులో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. శ్మశానాలు, డంపింగ్ యార్డులు పక్కనఉన్న, నివాసయోగ్యంకాని, వర్షంవస్తే మునిగిపోయే భూములను రెండింతల, మూడింతలుగా అధిక ధరలకు ప్రభుత్వంతో కొనిపించారని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్లలో అర్హతగల ప్రతి పేదవాడికి అర్బన్‌లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున్న ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించాలన్నదే ప్రభుత్వప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణమూర్తి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, తహసీ ల్దార్ ఆర్.అప్పలరాజు, వెలమల కామేశ్వరరావు పాల్గొన్నారు.కాగా నిమ్మాడలోని గ్రామదేవతకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.