శాంతి, సామరస్యం నెలకొల్పడమే లక్ష్యం
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:41 PM
జిల్లాలో శాంతి, సామరస్యం నెలకొల్పడమే లక్ష్యమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శాంతి, సామరస్యం నెలకొల్పడమే లక్ష్యమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మత సామరస్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ మతాలను అనుసరించే ప్రజల్లో అపార్థాలు, విభేదాలు రాకుండా కమిటీ కృషి చేస్తుందన్నారు. పండుగలు శాంతియుత వాతావరణంలో నిర్వహించి ప్రజలంతా కలిసి మెలిసి జీవించాలన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాల న్నారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 672 సీసీ కెమెరాలు అమర్చారన్నారు. మిగిలిన ప్రార్థనా స్థలాల్లో కూడా ఏర్పాటు చేయాల న్నారు. దేవాల యాలు, చర్చి, మసీదు గోడలపై మత విద్వేషపూరిత రాతలు రాసేవారిని గుర్తించి కఠిన చర్య లు తీసుకుంటామన్నారు. అనంతరం మత పెద్దలు తమ ప్రాంతాల్లో ఎదురవుతున్న ఇబ్బం దులను వివరిం చారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీ రాజ్‌కుమార్, డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, లక్ష్మణరావు, సీఐలు శ్రీనివాసరావు, పైడపునాయుడు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.