దళారీ వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:02 AM
రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడే దళారీ వ్యవస్థ నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే, పీయూసీ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు.
ఎమ్మెల్యే రవికుమార్
సరుబుజ్జిలి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడే దళారీ వ్యవస్థ నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే, పీయూసీ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. సరుబుజ్జిలి రైతు సేవా కేంద్రంలో సోమారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అలాగే ఎస్‌హెచ్‌జీ మహిళల సహ జ ఉత్పత్తుల శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినప్పుడు తూకంలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. అటువంటి ధాన్యం కొనుగోలు కేం ద్రాలు, మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిం చారు. డ్వాక్రా సంఘాల మహిళలను అన్ని రంగాల్లో ఆర్థిక స్వావ లంబన సాధించే దిశలో చర్యలు చేపడుతున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్, జిల్లా నాబార్డు అభివృద్ధి అధికారి రమేష్ కృష్ణ, డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, తహసీ ల్దార్ ఎల్.మధుసూద న్, ఎంపీడీవో ఎం.పావని, ఏవో కె. మన్మథరావు, ఏపీఎం గోవిందరావు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు అండగా ప్రభుత్వం
పొందూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన చేసే దిశలో ప్రభు త్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సిస్టం కళా శాల ఆవరణలో మెగా జాబ్‌మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు నైపుణ్యాభివృద్ది కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆర్.లక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్ అన్నెపు రాము, టీడీపీ పట్టణ అధ్యక్షుడు అనకాపల్లి చిన రంగ, పార్టీ ఉపాధ్యక్షుడు బాడాన గిరి పలువురు నేతలు, కళాశాల డైరెక్టర్ ఎం.మోహనరావు తదితరులు పాల్గొ న్నారు. రాపాక గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రవికుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్.వెంకటేష్, ఏవో శ్రీనివాసరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు వండాన మురళి తదితరులు పాల్గొన్నారు.