మహిళలకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యం
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:23 AM
మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ సంక్షే పథకాలను ప్రవేశపెట్టారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
సరుబుజ్జిలి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ సంక్షే పథకాలను ప్రవేశపెట్టారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా పర్యటన కు వెళుతున్న మంత్రికి సరుబుజ్జిలి మండల కేంద్రంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్య నారాయణ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా సరుబుజ్జిలి గ్రామ సచివాలయంలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయ న సందర్శించి మహిళలతో మాట్లాడారు. ఉదయం 9 గంటల నుంచి శిక్షణ ప్రారం భించడం వల్ల ఇబ్బంది పడుతున్నామని, సమయపాలనలో మార్పులు చేయించాలని మంత్రిని మహిళలు కోరారు. దీంతో జిల్లా మేనేజర్‌తో మంత్రి ఫోన్‌లో మాట్లాడగా.. కమిషనర్ ఆదేశాలు మేరకు నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. కమిషనర్‌తో మాట్లా డుతానని, జిల్లాలోని అన్ని శిక్షణ కేంద్రాల్లో సమయాలు మార్చేలా చర్యలు తీసుకోవాల ని ఆదేశించారు. టీడీనీ నాయకులు దవళ సింహాచలం, బస్వా ఉమామహేశ్వరరావు, గుర్రాల చినబాబు, సురేష్, మధు, రాజారావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.