ఐదు లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:52 PM
:రాష్ట్రంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడ మే లక్ష్యంగా ముందుచూపుతో సీఎం దూసుకుపోతున్నారని, రానున్నరోజుల్లో యువతకు ఉపాఽధిఅవకాశాలు అపారంగా పెరగనున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షు డు కలమట వెంకటరమణమూర్తి తెలిపారు.
కొత్తూరు, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడ మే లక్ష్యంగా ముందుచూపుతో సీఎం దూసుకుపోతున్నారని, రానున్నరోజుల్లో యువతకు ఉపాఽధిఅవకాశాలు అపారంగా పెరగనున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షు డు కలమట వెంకటరమణమూర్తి తెలిపారు. సీఎంచంద్రబాబునాయుడు దూర దృష్టితో ప్రణాళికంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు రాష్ట్రానికి తీసుకువస్తున్నారని చెప్పారు. సోమవారం కొత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ గూగుల్ వంటి కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయంటే ముందుతరాలవారికి ప్రపంచస్థాయి అవకాశాలు వస్తు న్నట్టేనని తెలిపారు.విశాఖపట్నం ఏఐ సిటీగా మారితే ఏపీ దేశానికి డిజిటల్ ఇండి యాలో మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు.సమావేశంలో టీడీపీ నాయకులు గేదెల జగన్మోహనరావు, కర్రి అప్పారావు, రేగేటి వెంకటరమణ, వాసు పాల్గొన్నారు.