ఉపాధి కల్పనే ధ్యేయం
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:58 PM
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభు త్వం పనిచేస్తోందని ఎమ్మె ల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు.
ఎచ్చెర్ల, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభు త్వం పనిచేస్తోందని ఎమ్మె ల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. మంగళవారం ఎచ్చెర్లలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాలో 14 సంస్థలు పాల్గొనగా, 311 మందికి ని యామకపత్రాలు అందజేశా రు. కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ చౌదరి అవినాష్, జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.సుధ, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికు మార్, ఎన్‌వైకే డిప్యూటీ డైరెక్టర్ ఉజ్వల్, సెట్‌శ్రీ సీఈవో అప్పలనా యుడు, జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, బుడుమూరు శ్రీరా మ్మూర్తి, ఎస్‌సీవీ రమణమూర్తినాయుడు పాల్గొన్నారు.