Share News

పట్టణాల పరిశుభ్రతే లక్ష్యం: ఎమ్మెల్యే రవికుమార్‌

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:36 PM

మునిసిపాలిటీలను పరిశుభ్రంగా ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్య మని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు.

పట్టణాల పరిశుభ్రతే లక్ష్యం: ఎమ్మెల్యే రవికుమార్‌
పారిశుధ్య వాహనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): మునిసి పాలిటీలను పరిశుభ్రంగా ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్య మని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు. ముని సిపాలిటీ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.45 లక్షలతో కొనుగోలు చేసి కంపాక్టర్‌ వాహనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతా వరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ఒక్క ప్రభుత్వ లక్ష్యం మాత్రమేకాదని, ఇది ప్రతి పౌరుని బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ తమ్మినేని రవి, డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ, మునిసిపల్‌ మాజీ చైరపర్సన్‌ తమ్మినేని గీతాసాగర్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు శిమ్మ మాధవి, టీడీపీ సీనియర్‌ నాయకులు మొదలవలస రమేష్‌, కణితి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో సమీక్ష

పురపాలక సంఘం కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల పీఏసీఎస్‌, వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే రవికుమార్‌ నిర్వహించారు. పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రైతులకు ఎరువుల పంపిణీపై వ్యవసా యాధికారు లను అడిగి తెలుసుకున్నారు. ఎరువుల కొరత ఉందని వారు తెలపడంతో వెంటనే జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో ఫోన్‌లో మాట్లాడి నియోజకవర్గానికి అదనపు ఎరువులను కేటాయించాలని కోరారు. ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన ఇన్‌చార్జి ఎంఈవో కె.అప్పలరాములు శుక్రవారం ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - Aug 22 , 2025 | 11:36 PM