పక్కా ఇళ్ల నిర్మాణం ధ్యేయం
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:35 PM
పక్కా ఇళ్ల నిర్మాణం ప్రభు త్వ లక్ష్యమని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఆమదాలవలస, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పక్కా ఇళ్ల నిర్మాణం ప్రభు త్వ లక్ష్యమని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శుక్రవారం మునిసిపల్ కార్యాల యంలో పీఎంఏవై గృహ నిర్మాణ లబ్ధి దారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి సీఎం ఎన్టీరామారావు పక్కా గృహాల నిర్మాణాలను ప్రారంభించి పేదల సొంతింటి కల నెరవేర్చారన్నారు. ఆ తరువాత చంద్ర బాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హుద్‌హుద్ నిధులతో 512 ఇళ్లను నిర్మించి పేదలకు అందజేశారన్నా రు. ఆ తర్వాత జగ్గుశాస్ర్తులపేట వద్ద 522 టిడ్కో ఇళ్లను మంజూరు చేయడం జరిగిం దన్నారు. ఆ తరువాత వైసీపీ హయాంలో టిడ్కో ఇళ్లను పూర్తి చేయకుండా వదిలేశారన్నారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీకి పనులను పూర్తి చేసి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తా మన్నారు. కార్య క్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు మొదలవలస రమేష్, ముని సిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీత, కాళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, పీఏసీఎస్ అధ్యక్షుడు శిమ్మ మాధవి, హౌసింగ్ పీడీ రమాకాంత్, మునిసిపల్ కమిషనర్ తమ్మినేని రవి, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.