Share News

శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం: డీఈవో

ABN , Publish Date - Jul 01 , 2025 | 11:59 PM

పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రతి ఉపాధ్యాయుడు పనిచేయాలని జిల్లా విధ్యాశాఖాధికారి తిరుమల చైతన్య కోరారు. మంగళవారం కంచిలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, సోంపేట మండలాల పరిధిలోని ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.

శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం: డీఈవో
ఎస్‌ఆర్‌సీపురం పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో తిరుమల చైతన్య ః

కంచిలి, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రతి ఉపాధ్యాయుడు పనిచేయాలని జిల్లా విధ్యాశాఖాధికారి తిరుమల చైతన్య కోరారు. మంగళవారం కంచిలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, సోంపేట మండలాల పరిధిలోని ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం మెనూ తప్పనిసరిగా అమలుచేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషిచేయాలని కోరారు. పురుషోత్తపురం ప్రభుత్వ పాఠశాలలో గతంలో 17మంది ఉండగా, ఈఏడాది 45 మందికి విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు తెలిపారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి వారికి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.అలాగే హెచ్‌ఎం శారద, ఉపాధ్యాయుడు నల్లాన రవికుమార్‌ను డీఈవో అభినందించారు.అనంతరం ఎస్‌ఆర్‌సీ పురం పాఠశాలన తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవోలు ఎస్‌.శివరాంప్రసాద్‌, ధనుంజయ మజ్జి, కె.అప్పారావు, ఎస్‌.జోరాడు,హెచ్‌ఎం చాణక్య పాల్గొన్నారు.

ఇచ్ఛాపురం, జూలై 1(ఆంధ్రజ్యోతి):ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మధ్యా హ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులకు రుచికరమైన, సరిపడ భోజనం అంద జేయాలని డీఈవో తిరుమల చైతన్య ఏజన్సీ నిర్వాహకులకు కోరారు. మంగళవా రం పురుషోత్తపురం ఏపీమోడల్‌ స్కూల్‌లో మధ్యాహ్న భోజన పఽథకాన్ని పరిశీలిం చారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ముచ్చింద్ర ప్రాఽథమిక పాఠశాల పరిశీలించారు.పాఠశాల ఉపాధ్యాయిని బి.అరుణకుమారి తన పిల్లలను అదే పాఠశాలలో చేర్పించడంపై డీఈవో ప్రశంసించారు. కార్యక్రమంలో ఎంఈవో కె.అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 11:59 PM