మహిళల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:27 PM
:మహిళల సంక్షేమమే కూటమి ప్రభు త్వ ధ్యేయమని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఆదివారం మండలంలోని పెద్దకోటలో పీఏసీఎస్‌అధ్యక్షుడు కె.మన్మఽథరావు ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఎల్.ఎన్.పేట, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి):మహిళల సంక్షేమమే కూటమి ప్రభు త్వ ధ్యేయమని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఆదివారం మండలంలోని పెద్దకోటలో పీఏసీఎస్‌అధ్యక్షుడు కె.మన్మఽథరావు ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలముం దు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దశలవారీగా నెరవేర్చుతున్నారని తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఇప్పటికే అందజేస్తున్నట్లు చెప్పారు. మహిళలకు డ్వాక్రాసంఘాలద్వారా తక్కువ వడ్డీకే రుణాలను అందజేసి ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు బ్యాంకుల ద్వారా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలు ఆర్థికంగా స్థిరపడితే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజాసంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన జరుగుతోం దన్నారు. రాజకీయాలకతీతంగా సంక్షేమ పఽథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం. మనోహర్‌నా యుడు, కె.చిరంజీవి, బీఆర్‌ఆర్ వంశధార ప్రాజెక్టు జిల్లా వైస్‌చైర్మన్ వి. ఆనంద రావు, నాయకులు గోవిందరావు, ఎస్. తేజేశ్వరరావు, ఎ.పోలినాయుడు పాల్గొన్నారు.