మునిసిపాలిటీ అభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - May 15 , 2025 | 11:04 PM
మునిసిపాలిటీ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.గురువారం పలాస- కాశీబుగ్గ మునిసిపాలిటీలోని మూడోవార్డు పరిధి నెహ్రూనగర్‌లో సీసీ రోడ్డు,కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కాశీబుగ్గ, మే 15 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.గురువారం పలాస- కాశీబుగ్గ మునిసిపాలిటీలోని మూడోవార్డు పరిధి నెహ్రూనగర్‌లో సీసీ రోడ్డు,కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే కాశీబుగ్గలో వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.కార్యక్రమంలో కమిషనర్ రామారావు, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కా ర్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబురావు, లొడగల కామేశ్వరరావు, గాలి కృష్ణారావు, సూర్యనారా యణ, దువ్వాడ శ్రీకాంత్, కౌన్సిలర్ ఆనంద్, బడ్డ నాగరాజు, నవీన్, రాంబాబు, రామకృష్ణ, సత్యం పాల్గొన్నారు.
ఫవజ్రపుకొత్తూరు, మే 15(ఆంధ్రజ్యోతి):వజ్రపుకొత్తూరులో కుట్టుమిషన్ శిక్షణకేంద్రాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎన్.రమేష్‌నాయుడు, తహసీల్దార్ సీతారామయ్య, డీటీ మురళీకృష్ణ, నాయకులు సూరాడ మోహనరావు, అర్సవెళ్లి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
ఫపలాస, మే 15(ఆంధ్రజ్యోతి):పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి ఉద్దానం రక్షిత మంచి నీటి పథకం నుంచి తాగునీరందించేందుకు అవరోధాలు అధిగమించేందుకు చర్యలు తీసు కున్న కలెక్టర్ స్వప్నిల్‌దినకర్ పుండ్కర్‌కు పలాస ఎమ్మెల్యే గౌతుశిరీష కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టర్‌కుఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, పీరుకట్ల విఠల్‌రావుతో పాటు టీడీపీనాయకులతో కలిశారు. ఆఫ్‌షోర్ నీరు వచ్చేవరకూ ఉద్దానం జలాలు సరఫరా కు చర్యలు తీసుకున్న కలెక్టర్‌కు ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు.