సంస్థాగతంగా బలోపేతమే లక్ష్యం
ABN , Publish Date - Jun 29 , 2025 | 12:07 AM
గ్రామస్థాయిలో కమి టీలు ఏర్పాటుచేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని ఇచ్ఛాపురం నియోజక వర్గ టీడీపీ పరిశీలకులు పి.విఠల్, ఎల్.కామేష్, డి. తాతారావు తెలిపారు.
కవిటి, జూన్28(ఆంధ్రజ్యోతి): గ్రామస్థాయిలో కమి టీలు ఏర్పాటుచేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని ఇచ్ఛాపురం నియోజక వర్గ టీడీపీ పరిశీలకులు పి.విఠల్, ఎల్.కామేష్, డి. తాతారావు తెలిపారు. శనివారం రామయ్యపుట్టుగలో నియోజకవర్గంలోని స్థాయి మండలకమిటీ ప్రతినిధు లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా విఠల్ మాట్లాడుతూ మండలస్థాయిలో ఏర్పాటుచేసిన కమి టీలతోచర్చించి గ్రామ,బూత్ స్థాయిల్లోకమిటీలతోపాటు యూనిట్ కన్వీనర్,కో కన్వీనర్ల నియామకం త్వరగా పూర్తిచేస్తామన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినా పార్టీ కార్యకర్తలకు సరైన న్యాయం జరగడంలేదని కొందరు మండలనేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కార్య క్రమంలో ఏఎంసీ చైర్మన్ మణిచంద్రప్రకాష్, కవిటి, ఇచ్ఛాపురం, కంచిలి మండల పార్టీఅధ్యక్షులు పి.కృష్ణారావు, పద్మనాభం, తవిటయ్య, రామారావు పాల్గొన్నారు.