Share News

సమగ్ర అభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Jun 23 , 2025 | 12:15 AM

నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు.

సమగ్ర అభివృద్ధే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న కూన రవికుమార్‌

  • ఏడాదిలో ఇంటింటికీ తాగునీరు

  • పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఆమదాలవలస, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ అన్నారు. ఆదివారం మండలంలోని కనుగు వలస గ్రామంలో సుమారు కోటి రూపాయల నిధులతో నిర్మాణం పూర్తి చే సుకున్న 18 సీసీ రహదారులను ఆయన ప్రారంభించారు. తొలుత గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే రవికుమార్‌కు సర్పంచ్‌, పార్టీ మండల అధ్యక్షుడు నూక అప్పల సూరనాయుడు ఘన స్వాగతం పలికి వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదన్నారు. కొంత మంది నాయకులు గతంలో ఆమదాలవలసను అందాలవలసగా తయారు చేస్తామని ప్రగల్బాలు పలికారన్నారు. తాను వారిలా మాటల మనిషిని కాదని, చేతల మనిషిని అని అన్నారు. తాను శాసనసభ్యుడిగా పనిచేసిన ఏడాది కాలంలో రూ.500 కోట్లు నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలో అభివృద్ధి కా ర్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. సీఎస్‌పీ రహదారి నుంచి ముద్దాడపేట వరకు 13 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. తొందరిలోనే రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రతి గ్రామానికి రహదారి, తాగునీరు వం టి మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ పనిచేస్తున్నారన్నారు. కనుగులవలస గ్రామంలో ఏడాదిలోనే ఇంటింటికి తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేస్తానన్నారు. కార్యక్ర మంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తమ్మినేని చంద్రశేఖర్‌, నారాయణపురం ఆనక ట్టు చైర్మన్‌ సనపల ఢిల్లేశ్వరరావు, జిల్లా తెలుగు మహి ళా అధ్యక్షురాలు తమ్మినేనిసుజాత, బీజేపీ నియోజక వర్గ ఇన్‌చార్జి పేడా డ సూరపునాయుడు, రిటైర్డు డీఎస్పీ నూక సుదర్శనరావు, జన విజ్ఞాన జిల్లా గౌరవాధ్యక్షుడు బొడ్డేపల్లి జనార్దరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 12:15 AM