Share News

డ్రగ్స్‌ రహిత సమాజమే ధ్యేయం

ABN , Publish Date - Dec 17 , 2025 | 11:54 PM

డ్రగ్స్‌ రహిత సమాజమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మె ల్యే కూన రవికుమార్‌ అన్నారు.

డ్రగ్స్‌ రహిత సమాజమే ధ్యేయం
సైకిల్‌యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే రవికుమార్‌, డీఎస్పీ వివేకానంద

ఆమదాలవలసలో ‘అభ్యుదయం’ సైకిల్‌యాత్ర

ఆమదాలవలస, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ రహిత సమాజమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మె ల్యే కూన రవికుమార్‌ అన్నారు. బుధవారం పట్టణ శివారున ఉన్న ఆమదాలవలస ప్లై ఓవర్‌ నుంచి కృష్ణాపురం వరకు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోలీసు సిబ్బంది చేపట్టిన అభ్యుదయం సైకిల్‌ యాత్రలో విద్యార్థులతో కలిసి పాల్గొ న్నారు. అనంతరం రైల్వేస్టేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల్లో ఆరు లక్షల టన్నుల గంజాయిని సీజ్‌ చేసి, 4,581 కేసులు నమోదు చేసిం దన్నారు. యువత ఉపాధి కోసం రానున్న రోజుల్లో మూడు లక్షల ఐటీ కొలువులు రాను న్నాయన్నారు. డీఎస్పీ వివేకా నంద మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండేందుకు ప్రభుత్వం, పోలీస్‌శాఖ ప్రతిష్టాత్మ కంగా ‘అభ్యుదయం’ సైకిల్‌ యాత్ర చేపట్టి అవగా హన కలిగిస్తున్నాయన్నారు. పిల్లల రోజువారి దినచర్యను గమనించి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంద న్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకుడు మొదలవలస రమేష్‌, కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తమ్మినేని చంద్రశేఖర్‌, సీఐ పి.సత్యనారాయణ, ఎస్‌ఐలు, మున్సిపల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ తమ్మినేని గీత, నాయకులు సంపద రావు మురళి, నూకరాజు, నాగళ్ల మురళీధర్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2025 | 12:12 AM