కుమారుడి కళ్లెదుటే తండ్రి దుర్మరణం
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:29 AM
బిన్నల మదనాపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతిచెందగా... కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.
హరిపురం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): బిన్నల మదనాపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతిచెందగా... కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. మందస పోలీసుల వివరాల మేరకు జీఆర్‌పురం గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు సాసుమాను మోహనరావు(58), నరసింహులు(36) పొలం పనుల కోసం బిన్నల సమీపంలోకి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేందుకు రోడ్డు పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని సిద్ధం చేస్తుండగా... గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొంది. దీంతో తండ్రి మోహనరావు అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారుడు నరసింహులు తీవ్ర గాయాలపాలయ్యాడు. బాధితుడిని వెంటనే 108లో హరిపురం సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.