గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమించాలి
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:13 AM
గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను అధిగమిస్తూ భూ రీసర్వే నిర్వహించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సూ చించారు.
పాతపట్నం, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను అధిగమిస్తూ భూ రీసర్వే నిర్వహించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సూ చించారు. కొరసవాడ గ్రామంలో గురువారం భూ రీసర్వేను ఎమ్మెల్యే ప్రారంభిం చారు. పెద్దవీధి కూడలిలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. వై సీపీ ప్రభుత్వ నిర్వహణ వైఫల్యాలను అధిగమిస్తూ ప్రజాప్రయోజనాలే లక్ష్యం గా భూ రీసర్వే రూపొందించబడిందన్నారు. రైతుల సమక్షంలోనే భూ రీసర్వే అధికారులు నిర్వహిస్తామని టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి అన్నారు. శాశ్వత ప్రాతిపదికన భూ సమస్యల పరిష్కారాలు చూపేందుకు రీసర్వే వేదికగా నిలు స్తుందన్నారు. అనంతరం కొరసవాడ పెద్దవీధి కూడలి నుంచి ప్రధాన రహదా రి గుండా రామమందిరం వరకూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నందిగామ ప్రసాదరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు బండి రవివర్మ, డివిజినల్ సర్వేయర్ ఎం.జనార్దనరావు, సర్వేయర్ వట్టి మహేష్, కూటమి నేతలు మడ్డు రామారావు, మంచు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే కాగువాడలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను వారు సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు.