Share News

కర్రెన్న మృతిపై వాస్తవాలు తేల్చాలి

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:15 AM

మెళియాపుట్టి మండలం పడ్డ పంచాయతీ పరిధిలోని ఓ గ్రానైట్‌ క్వారీలో జలగలింగుపురం గ్రామానికి చెందిన కార్మికుడు రాణ కర్రెన్న(45) మృతి చెందడంపై పలు అనుమానాలు ఉన్నాయని సర్పంచ్‌ ప్రతినిధి రవ్వల గణపతి, జనసేన నాయకుడు దుక్క బాలరాజు, గ్రామ యువజన సంఘం నాయకుడు కొల్లి వాసు అన్నారు.

కర్రెన్న మృతిపై వాస్తవాలు తేల్చాలి
టెక్కలి ఆసుపత్రి వద్ద ధర్నా చేస్తున్న జలగలింగుపురం గ్రామస్థులు

- ఆస్పత్రి ఎదుట గ్రానైట్‌ కార్మికుడి కుటుంబ సభ్యుల ధర్నా

టెక్కలి/మెళియాపుట్టి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): మెళియాపుట్టి మండలం పడ్డ పంచాయతీ పరిధిలోని ఓ గ్రానైట్‌ క్వారీలో జలగలింగుపురం గ్రామానికి చెందిన కార్మికుడు రాణ కర్రెన్న(45) మృతి చెందడంపై పలు అనుమానాలు ఉన్నాయని సర్పంచ్‌ ప్రతినిధి రవ్వల గణపతి, జనసేన నాయకుడు దుక్క బాలరాజు, గ్రామ యువజన సంఘం నాయకుడు కొల్లి వాసు అన్నారు. కర్రెన్న మృతిపై వాస్తవాలు తేల్చాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద మృతుని కుటుంబసభ్యలు, గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్వారీ పనులకు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లిన కర్రెన్న మృతిచెందడంపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణ మని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకూ పోస్టుమార్టంకు ఒప్పు కొనేది లేదంటూ ఆందోళన చేశారు. దీంతో పాతపట్నం సీఐ సన్యాసినా యుడు, మెళియాపుట్టి ఎస్‌ఐ రమేష్‌బాబు ఆసుపత్రి వద్దకు వచ్చి వారితో చర్చలు జరిపారు. గ్రానైట్‌ యాజమాన్యం ఆర్థిక సాయం చేసేందుకు ముం దుకురాకపోడంతో గత రెండురోజలుగా మృతదేహం మార్చురీలోనే ఉంది.

Updated Date - Nov 19 , 2025 | 12:15 AM