ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:17 AM
Entrance exam for admissions వచ్చే విద్యా సంవత్సరంలో(2026-27) వివిధ కోర్సుల్లో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రొఫెషనల్, టెక్నికల్, నాన్‌టెక్నికల్ సబ్జెక్ట్‌లకు సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
- ఏప్రిల్, మే నెలల్లో నిర్వహణకు సన్నాహాలు
ఎచ్చెర్ల, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యా సంవత్సరంలో(2026-27) వివిధ కోర్సుల్లో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రొఫెషనల్, టెక్నికల్, నాన్‌టెక్నికల్ సబ్జెక్ట్‌లకు సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, లా, బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షతోపాటు డిప్లమో పూర్తిచేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశానికి కూడా షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 23న ఏపీ ఈసెట్, ఏప్రిల్ 28న ఏపీ ఐసెట్, ఏప్రిల్ 29, 30, మే 2వ తేదీల్లో ఏపీ పీజీఈసెట్, మే 4న ఏపీ లాసెట్, ఏపీ ఎడ్‌సెట్, మే 5,8,9,10,11 తేదీల్లో ఏపీ పీజీసెట్, మే 12,13,14,15,18 తేదీల్లో ఏపీ ఈఏపీ సెట్(ఇంజనీరింగ్), మే 19,20 తేదీల్లో ఏపీ ఈఏపీ సెట్(అగ్రికల్చర్, ఫార్మసీ) నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థుల్లో సందడి నెలకొంది. ఓ వైపు ఈ ఏడాది ఫైనల్ పరీక్షలకు సిద్ధమవుతూనే.. మరోవైపు పేరున్న కళాశాలల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీటు పొందేలా సెట్ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. ‘కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులు ముందుగా పరీక్ష సిలబస్‌ను పూర్తిగా అర్ధం చేసుకోవాలి. రోజువారీ చదువు సమయాన్ని ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకోవాలి. రోజూ ప్రశ్నల సాధన తప్పనిసరిగా చేయాలి. తరచూ మాక్ టెస్ట్‌లు రాసి సమయపాలన మెరుగుపర్చుకోవాలి. చదివిన అంశాలను తరుచూ పునశ్చరణ చేయాల’ని విద్యావేత్తలు సూచిస్తున్నారు.