Share News

వైసీపీ పాలనంతా అరాచకమే

ABN , Publish Date - Nov 03 , 2025 | 11:11 PM

‘గత వైసీపీ ప్రభుత్వ పాలనంతా అరాచకమే. పేదలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను రద్దు చేసింది. రూ.5కే పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్‌లు కూడా మూసేసి వారి కడుపు కొట్టింది.’ అని కేంద్ర విమానాయానశాఖామంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

 వైసీపీ పాలనంతా అరాచకమే
అన్నా క్యాంటీన్‌ను ప్రారంభిస్తున్న మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు

- పేదలకు అన ్నం పెట్టే అన్నా క్యాంటీన్‌లను మూసేసింది

-కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘గత వైసీపీ ప్రభుత్వ పాలనంతా అరాచకమే. పేదలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను రద్దు చేసింది. రూ.5కే పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్‌లు కూడా మూసేసి వారి కడుపు కొట్టింది.’ అని కేంద్ర విమానాయానశాఖామంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా రూ.61లక్షల వ్యయంతో నిర్మించిన అన్నా క్యాంటీన్‌ను సోమవారం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి వారు ప్రారంచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారినా పేదలకు ఉపయోగపడే పథకాలు కొనసాగించాలని, కానీ అందుకు భిన్నంగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నా క్యాంటీనుల పునఃప్రారంభానికి తొలి సంతకం చేశారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 207 క్యాంటీన్లు నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. జనవరిలో మరో 70 ప్రారంభిస్తామన్నారు. నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. టెక్కలి నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.600 కోట్లు మంజూరు చేశామని, రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. తొలుత స్థానిక ఎన్టీఆర్‌, ఎర్రన్నాయుడు పార్కును సందర్శించారు. పార్కు వద్ద ఉన్న భవిత కేంద్రాన్ని పక్కన ఉన్న పాఠశాలకు తరలించి, దాని స్థానంలో అధునాతన హంగులతో గ్రంథాలయాన్ని నిర్మించాలని కలెక్టర్‌కు వివరించారు. మండల కేంద్రంలో రూ.39లక్షల వ్యయంతో నిర్మించనున్న జిల్లా సహకార బ్యాంకు నూతన భవనానికి శుంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, ఏఎంసీ చైర్మన్‌ బగాది శేషగిరి, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, మాజీ ఎంపీపీ తర్ర రామకృష్ణ, ఎంపీడీవో కె.ఫణ్రీందకుమార్‌, తహసీల్దార్‌ అప్పలరాజు, డీసీసీబీ సీఈవో దట్ట సత్యన్నారాయణ, బీఎం దాసరి వెంకటరమణమూర్తి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 11:11 PM