Share News

వైసీపీ నాయకుల అత్యుత్సాహం

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:03 AM

నగరంలో సోమవారం చేపట్టిన ర్యాలీలో వైసీపీ నేతలు అత్యుత్సాహంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బారికేడ్లను తొలగించి వెళ్లడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.

వైసీపీ నాయకుల అత్యుత్సాహం
వైసీపీ నిరసనతో నిలిచిన ట్రాఫిక్‌

వాహనదారుల ఇబ్బందులు

శ్రీకాకుళం అర్బన్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): నగరంలో సోమవారం చేపట్టిన ర్యాలీలో వైసీపీ నేతలు అత్యుత్సాహంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బారికేడ్లను తొలగించి వెళ్లడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఒకానొక సమయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పొట్టి శ్రీరా ములు మార్కెట్‌ జంక్షన్‌ సమీపంలో తమ కార్యకర్త లను అడ్డుకుంటారా అంటూ ఓపెన్‌ టాప్‌జీపు లో వెళ్లనీయరా అంటూ టెక్కలి వైసీపీ ఇన్‌చార్జి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు సోమవారం మెడికల్‌ కళాశాలల ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అంత కుముందు టౌన్‌హాల్‌ క్లబ్‌లో సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్‌, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్‌, నాయకులు పేరాడ తిలక్‌, కుంభా రవిబాబు, మామిడి శ్రీకాంత్‌, చింతాడ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:03 AM