Share News

కారు బోల్తాపడి డ్రైవర్‌ మృతి

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:55 PM

చిలకపాలెం జంక్షన్‌కు సమీపంలో జాతీ య రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్‌ మృ తిచెందాడు.

కారు బోల్తాపడి డ్రైవర్‌ మృతి

ఎచ్చెర్ల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): చిలకపాలెం జంక్షన్‌కు సమీపంలో జాతీ య రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్‌ మృ తిచెందాడు. పోలీసులు తెలి పిన వివరాలిలా ఉన్నాయి.. బెంగుళూరు (కర్ణాటక) పరిధి బట్రానిపురానికి చెందిన ఎన్‌.నవీన్‌ తన స్నేహితులతో కలిసి ఒడిశాలోని ఆలయాల సందర్శనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ ఎస్‌.అర్జున్‌ (27) అతి వేగంగా కారును నడపడంతో వెనుక టైరు పేలి వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డ్రై వర్‌ను శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొం దుతూ మృతిచెందాడు. కారులో డ్రైవర్‌తో సహా ఐదుగురు వ్యక్తులు ప్రయాణి స్తున్నారు. మిగిలిన నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఎస్‌ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో ఢీకొని ఒకరు..

పాతపట్నం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై పాతపట్నం పరిధి శివశంకర్‌ కాలనీ కూ డలి వద్ద ఆటో ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శివశంక ర్‌ కాలనీ 4వ వీధికి చెందిన ఆనెం త్రినాథరావు(71) కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా.. పాతపట్నం బస్‌ స్టాండ్‌ నుంచి కోర్టు కూడలి వైపు వెలుతున్న ఆటో త్రినాఽథరావును ఢీకొంది. గాయపడిన త్రినాథరావును చికిత్స నిమిత్తం స్థానిక సామాజిక ఆసుపత్రికు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. త్రినాధరావు స్థానికంగా ఉండే ఓ బంగారం షాపులో పని చేస్తున్నాడు. పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. త్రినాథరావుకు భార్య శకుంతల, ఇద్దరు కుమారులు తుకారాం, లోకేశ్‌ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫి ర్యాదుమేరకు హెచ్‌సీ సీహెచ్‌వీ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శతాధిక వృద్ధుడు..

నందిగాం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): హరిదాసు పురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు కణితి ఆనందరావు (101) శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఈయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. ఆనంద రావు హరిదాసుపురం పెద్ద చెరువు నీటి వినియోగదారుల సంఘ అధ్యక్షుడిగా మూడు పర్యాయాలు సేవలందిం చారు. ప్రస్తుతం ఈయన కోడలు కణితి తరిణమ్మ హరిదాసుపురం ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. ఆనందరావు మృతి పై పలువురు సంతాపం తెలిపారు.

సిద్ధాశ్రమం వ్యవస్థాపకులు..

నరసన్నపేట, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పట్టణంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన సిద్ధాశ్రమం వ్యవస్థాపకులు గుడిపాటి వెంకటేశ్వరశర్మ (86) శనివారం చనిపోయారు. వృద్ధాప్య సమస్య లతో హైదరాబాదులో గల వనస్థలిపురంలోని ఆయన స్వగృహంలో మృతి చెందినట్టు సిద్ధాశ్రమం అధ్యక్షుడు పొట్నూరు కృష్ణారావు తెలిపారు. నరసన్నపేట పట్టణంలో నలబై సంవత్సరాలు కిందట ఈ ఆశ్రమా న్ని మరికొంతమందితో కలిసి ఏర్పాటు చేశారన్నారు. సిద్ధాశ్రమం ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యాక్రమాలు నిర్వహించి ఈ ప్రాంతవాసులకు సిద్ధాశ్రమ గురుస్వామిగా పేరుపొందారు. ఈ ఆశ్రమం ఏర్పాటు అయిన తరువాత ఎందరో స్వామిజీలు సందర్శించారు. గురుస్వామి వెంకటేశ్వరశర్మ మృతిపై ఆశ్రమ కౌన్సిల్‌ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, అయ్యప్ప భక్తులు సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 27 , 2025 | 11:55 PM