Share News

జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేయాలి

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:31 AM

క్రీడాకారులు జిల్లా ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేయాలి

  • కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): క్రీడాకారులు జిల్లా ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ఒడిశా రాష్ట్రం కటక్‌ వేదికగా గత నెల 30 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి ఓపెన్‌ తైక్వాండో పోటీల్లో సత్తాచాటిన జిల్లాకు చెందిన క్రీడాకారులను శుక్రవారం కేంద్ర మంత్రిని కలిసిశారు. వివిధ విభాగాల్లో 28 పతకాలను సాధించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. కోచ్‌లు గౌతమ్‌, నవీన్‌, వంశీ, మేనేజర్‌ హేమంత్‌, ఖాన్‌ తదితరులను అభినందించారు. తైక్వాండో శ్రీను, టీడీపీ నాయకులు మెండ దాసునాయుడు, కొర్ను ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రితో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన తైక్వాండో క్రీడాకారులు

Updated Date - Jun 07 , 2025 | 12:31 AM