Share News

అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో జిల్లాకు 43 పతకాలు

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:35 PM

గుంటూరు ఆచార్య నాగార్జున వర్సిటీ మైదానంలో రాష్ట్ర అథ్లెటిక్స్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో వివిధ విభాగాల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పాల్గొని 43 పతకాలు సాధించి ప్రతిభ కన బరిచారు.

అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో జిల్లాకు 43 పతకాలు
కవిటి: నడకపోటీలో విజేతగా నిలిచిన శృతి

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): గుంటూరు ఆచార్య నాగార్జున వర్సిటీ మైదానంలో రాష్ట్ర అథ్లెటిక్స్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో వివిధ విభాగాల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పాల్గొని 43 పతకాలు సాధించి ప్రతిభ కన బరిచారు. 17 బంగారు, 14 రజితం, 12 కాంస్య పతకాలు సాధిం చినట్లు టీమ్‌ కోచ్‌ కమ్‌ మేనేజర్‌ ఇ.అప్పన్న, రామయ్య పేర్కొ న్నారు. ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారులను రాష్ట్ర అథ్లెటి క్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ కె.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ఎన్‌. జయ్‌కుమార్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.మధుసూదనరావు, ఎం.సాంబమూర్తి, సభ్యులు బీవీ రమణ, కె.మాధవరావు, టి.శ్రీని వాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు.

నడక పోటీలో విజేత శృతి

కవిటి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): చిన్నమెళియాపుట్టుగకి చెందిన ఎం.శృతి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలో విజేతగా నిలిచింది. గుంటూరులో జరిగిన పోటీల్లో ఐదు కిలో మీటర్ల నడక పోటీలో ప్రథమస్థానం పొందింది. ఈమె కవిటి ప్రభు త్వ జూనియర్‌ కళాశాలలో చదువుతోంది. రాష్ట్రస్థాయిలో విజేతగా నిలవడంపై ప్రిన్సి పాల్‌, అధ్యాపకులు ఆమెను అభినందించారు. అలాగే కవిటి ఎస్‌వీజేలో డిగ్రీ చదు వుతున్న కె.శిరీష మూడు వేల మీటర్ల స్ట్రెప్లెచేజ్‌ పోటీలో పతకం సాధించి నట్లు కరస్పాండెంట్‌ బీవీ ప్రసాదరావు తెలిపారు. ఆమెను సిబ్బంది అభినందించారు.

Updated Date - Sep 30 , 2025 | 11:35 PM