Share News

‘వంశధార’ పూర్తితో జిల్లా సస్యశ్యామలం

ABN , Publish Date - Nov 28 , 2025 | 11:53 PM

వంశధార ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సస్యశ్యామ లం అవుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

‘వంశధార’ పూర్తితో జిల్లా సస్యశ్యామలం
మంత్రి అచ్చెన్నాయుడు

  • గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆలస్యం

  • 12 టీఎంసీల నీరు అందేలా చర్యలు

  • ఎత్తిపోతలతో రిజర్వాయర్‌ నింపేలా ఏర్పాట్లు

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): వంశధార ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సస్యశ్యామ లం అవుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, ఇందులో భాగంగానే సాగునీటి ప్రాజె క్టుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించిందన్నారు. ఈ మేరకు శుక్రవారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశా రు. జిల్లాలో ప్రధాన జీవనాధారమైన వంశఽధార ప్రాజెక్టు రూపకల్పనలో గత వైసీపీ ప్రభుత్వ తప్పి దాల వల్ల రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అం దకుండా పోయిందని, వేల కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రాజెక్టు రూపకల్ప నలో నేరడి బ్యారేజీ అత్యంత కీలకమైందని, దీన్ని సాం కేతికంగా, న్యాయపరంగా అడ్డంకులు తొలిగినప్పటికీ ఇంకా కొన్ని అవరోధాలు పెం డింగ్‌లో ఉన్నాయన్నారు. వా టిని అధికగమించడానికి ప్రయ త్నిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయంగా రిజర్వాయర్‌ నింపడానికి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూ ర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. 2023 సంవత్సరంలో గత వైసీపీ ప్రభుత్వం ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినా పూర్తిస్థాయిలో ని ధులు కేటాయించకపోవడంతో పూర్తి కాలేదని, చే సిన పనులకు నిధులు కూడా మంజూరు చేయలే దన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత రూ.176కోట్లు నిధులు చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. త్వరితగ తిన పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్య లు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఎత్తిపో తల పథ కం ద్వారా గొట్టా బ్యారేజీ నుంచి 12 టీఎంసీల నీటిని వంశ ధార రిజర్వాయర్‌లోకి పంపించి వరద సమయాల్లో వృథా నీటిని జాగ్రత్త చేసేందుకు చర్యలు తీసు కుంటున్నట్టు తెలిపారు. వంశధార కుడి కాలువుకు 2.4 కిలోమీటర్ల వద్ద ఈ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు మొదలయ్యాయన్నారు. రిజర్వాయ ర్‌ నిండితే వంశధార ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు కింద రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతుందన్నారు. అలాగే కూటమి ప్రభుత్వ లక్ష్యం మేరకు వంశధార, నాగా వళి నదులు అనుసంధానం పూర్తయితే మరింత భూమిసాగులోకి వస్తుందన్నారు. అలాగే ఉద్దానం తాగునీటి పథకానికి అవసరమైన నీరు అందడంతో పాటు జిల్లా ప్రజల చిరకాల నీటి సమస్యల తీరిపోతాయని మంత్రి స్పష్టం చేశారు. జిల్లా ప్రజల తరుఫున ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతుల తెలుపుతున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 11:53 PM