Share News

ఎండీయూ ఆపరేటర్ల తొలగింపు సరికాదు

ABN , Publish Date - May 22 , 2025 | 12:01 AM

నిరంతరం ప్రజాసేవే ల క్ష్యంగా పనిచేస్తున్న ఎండీయూ ఆపరేటర్ల తొలగింపు సరికాదని ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్య క్షుడు రౌతు సూర్యనారాయణ, ఏఐటీయూసీ నాయకుడు టి.తిరుపతిరావు అన్నారు.

ఎండీయూ ఆపరేటర్ల తొలగింపు సరికాదు
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న ఎండీయూ ఆపరేటర్లు

శ్రీకాకుళం కలెక్టరేట్‌/ శ్రీకాకుళం అర్బన్‌, మే 21(ఆంధ్రజ్యోతి): నిరంతరం ప్రజాసేవే ల క్ష్యంగా పనిచేస్తున్న ఎండీయూ ఆపరేటర్ల తొలగింపు సరికాదని ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్య క్షుడు రౌతు సూర్యనారాయణ, ఏఐటీయూసీ నాయకుడు టి.తిరుపతిరావు అన్నారు. నగరం లోని ఎన్జీవో హోమ్‌లో ఎండీయూ ఆపరేటర్లు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 9,260మంది ఆపరేటర్లు, 9,260 మంది సహాయకులు పనిచేస్తున్నారని, వీరంతా ఎలా బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విధుల్లో చేరిన సమయంలో 72 నెలల అగ్రిమెంట్‌ ఉందని, అంటే మరో రెండేళ్లపాటు విధు ల్లో కొనసాగే అవకాశం ఉందని, కానీ ప్రభుత్వం రాత్రికిరాత్రే అనాలోచిత నిర్ణయంతో వేల కుటుంబాలను రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించా లని, లేకుంటే కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామన్నారు. అనంతరం బైక్‌ ర్యాలీగా కలెక్టరేట్‌కు చే రుకుని నిరసన తెలిపారు. డీఎస్‌వోకు వినతిపత్రం అందజేశారు ఎండీయూ ప్రతినిధులు హే మసుందర్‌, వరహా నరసింహులు, వెంకట్రావు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 12:01 AM