వృద్ధుడి అదృశ్యం
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:34 AM
ఫరీద్‌పేట పంచా యతీ నవభారత్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న బూర్ల ప్రకాశరావు(84) అనే వృద్ధుడు కనిపించడం లేదని ఆయన కుమారుడు వాసుదేవరావు స్థానిక పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.
ఎచ్చెర్ల, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఫరీద్‌పేట పంచా యతీ నవభారత్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న బూర్ల ప్రకాశరావు(84) అనే వృద్ధుడు కనిపించడం లేదని ఆయన కుమారుడు వాసుదేవరావు స్థానిక పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. ప్రకాశరావు భార్య నెల రోజుల కిదట మృతి చెందడంతో ఆయన మానసిక స్థితి సరిగా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి చేరలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేస దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.