Share News

శిథిల భవనం తొలగించరు.. నిర్మాణంలో ఉన్న భవనం పూర్తిచేయరు

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:47 PM

మండలంలోని కొమరల్తాడ అంగన్‌వా డీ భవనం శిథిలావస్థకు చేరింది.దీంతో ఎప్పుడు కూలుతుందోనని చిన్నారుల తల్లిదండ్రు లు భయాందోళన చెందుతున్నారు.ప్రస్తుతం అంగన్‌వాడీకేంద్రం పాతపాఠశాల భవనంలో నిర్వహిస్తున్నారు

శిథిల భవనం తొలగించరు.. నిర్మాణంలో ఉన్న భవనం పూర్తిచేయరు
అర్ధాంతరంగా నిలిచిపోయిన అంగన్‌వాడీ భవనం ::

వజ్రపుకొత్తూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొమరల్తాడ అంగన్‌వా డీ భవనం శిథిలావస్థకు చేరింది.దీంతో ఎప్పుడు కూలుతుందోనని చిన్నారుల తల్లిదండ్రు లు భయాందోళన చెందుతున్నారు.ప్రస్తుతం అంగన్‌వాడీకేంద్రం పాతపాఠశాల భవనంలో నిర్వహిస్తున్నారు.ఈభవనం శ్లాబ్‌పెచ్చులూడుతుండడంతో ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనన్న భయాందోళన స్థానికుల్లో నెలకొంది.కాగాఈ అంగన్‌వాడీ భవనం శిథి లావస్థకుచేరంతో పక్కనే మరోభవనం నిర్మాణానికి పునాదుల వేసి ఏళ్లు గడుస్తున్నా భవ నం నిర్మాణం పూర్తికావడంలేదు.ప్రస్తుతం కొనసాగుతున్న భవనం ఖాళీచేయించి కనీసం అద్దెభవనంలో నిర్వహించాలని కోరుతున్నా అధికారులు స్పందించడంలేదని చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు.శిథిలావస్థకు చేరిన భవనం తొలగించడంలేదని, నిర్మాణంలో ఉన్న భవనం పూర్తి చేయడానికి కూడా చర్యలు చేపట్టకపోవడంపై స్థానికంగా విమర్శలొ స్తున్నాయి.ఇప్పటికైనా అధికారులు శిథిలావస్థకు చేరిన భవనంలో ఉన్న తరగతులు మరో గదిలో నిర్వహించాలని కోరుతున్నారు. కాగా అధికారులు దృష్టికి ఎన్నిసార్లు ఈ సమస్య తీసుకువెళ్లినా స్పందించడం లేదని సర్పంచ్‌ చింతరాజు చెప్పారు. మండల సర్వసభ్యస మావేశాల్లో అంగన్‌వాడీ భవనం సమస్య ప్రస్తావన చేసినట్లు తెలిపారు. నష్టం జరిగిన తరువాత స్పందించడం కంటే ముందస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - Sep 26 , 2025 | 11:47 PM