Share News

హమాలీల పొట్ట కొట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

ABN , Publish Date - Aug 10 , 2025 | 12:07 AM

బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాట్లింగ్‌ యూనిట్‌ ను విభజించి ఇక్కడి హమాలీల పొట్టకొట్ట వద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు అన్నారు. ఈ మేరకు శనివారం మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు.

హమాలీల పొట్ట కొట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలుపుతున్న హమాలీలు

ఎచ్చెర్ల, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): బేవరేజస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాట్లింగ్‌ యూనిట్‌ ను విభజించి ఇక్కడి హమాలీల పొట్టకొట్ట వద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు అన్నారు. ఈ మేరకు శనివారం మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎచ్చెర్లలో యూనిట్‌ ఏర్పాటు సమయంలో దళితులు తమ భూములను ఇచ్చా రని, అప్పటి నుంచి వారే హమాలీలుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. ఇప్పుడు ఈ యూనిట్‌ను విభజించి టెక్కలిలో మరో కేంద్రం ఏర్పాటు వల్ల ఇక్కడి హమాలీలు జీవనాధారం కోల్పోతారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని హమాలీలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో హమాలీల యూనియన్‌ నాయకులు దుప్పాడ బంగార్రాజు, టి.రామా రావు, ఎం.సురేష్‌, నిడిగింట్ల రమణ, బోనెల రాము, లింగాల రాము, గురుమూర్తి, సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఫ సమస్యను పరిష్కరించాలని కోరుతూ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావులను హమాలీలు కలిసి విన్నవించారు. కార్యక్ర మంలో మాజీ సర్పంచ్‌ మెండ రాజారావు, మాజీ ఉప సర్పంచ్‌ మూకళ్ల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2025 | 12:07 AM